రేపు కొమ్మారెడ్డి సాహితీ పురస్కార ఉత్సవం
గుంటూరు ఎడ్యుకేషన్: ఐక్య ఉపాధ్యాయ పత్రిక మాజీ ప్రధాన సంపాదకుడు, సాహితీవేత్త కొమ్మారెడ్డి కేశవరెడ్డి సాహితీ పురస్కార ఉత్సవాన్ని ఈనెల 29న నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్‌రావు, ఎం.కళాధర్ తెలిపారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో బుధవారం పురస్కార ఉత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఈనెల 29న సాయంత్రం 5 గంటలకు బ్రాడీపేట రెండోలైనులోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో కొమ్మారెడ్డి సాహితీ పురస్కారాన్ని ప్రముఖ రచయిత్రి ఓల్గాకు ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రముఖ సాహితీ విమర్శకుడు పాపినేని శివశంకర్, ఉపాధ్యాయులు, సాహిత్య అభిమానులు పాల్గొంటారని తెలిపారు. పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా సహాధ్యక్షులు జి.వెంకటేశ్వర్లు, వై.నాగమణి, జిల్లా కార్యదర్శులు సీహెచ్ ఆదినారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎండీ షకీలాబేగం, కె.రంగారావు, బెల్లంకొండ ప్రసాద్, కె.ప్రేమ్‌కుమార్, కోటిరెడ్డి పాల్గొన్నారు.
నేటి నుంచి రూబీ టోర్నమెంట్, ఎంపికలు
పెదకాకాని: మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామంలోని వేమన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నుంచి 68వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన అంతర్ జిల్లా రూబీ టోర్నమెంట్, ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌కు సంబధించిన షెడ్యూల్, ఆహ్వాన పత్రికను బుధవారం అధ్యాపకులు, టోర్నమెంట్ నిర్వాహకులు ఆవిష్కరించారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అండర్–17 బాలుర పోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 186 మంది క్రీడాకారులు హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. పోటీల ప్రారంభోత్సవ సభకు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్, జిల్లా విద్యాశాఖ అధికారులు హాజరవుతారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్ తిరుపతిరావు తెలిపారు. పోటీలను వ్యాయామ అధ్యాపకుడు పి మస్తాన్‌రెడ్డి పర్యవేక్షిస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment