బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష వాహనం ప్రారంభం
గుంటూరు వెస్ట్: బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష వాహనాన్ని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ విజయలక్ష్మితో కలిసి నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రీయ బాల సురక్షా రక్ష కార్యక్రమంలో భాగంగా బాలల సంపూర్ణ ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాన్ని ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఎ.శ్రావణ్ బాబు, జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ దాసరి శ్రీనివాసులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment