కుంకలగుంటలోని ఆలయంలో చోరీ
నకరికల్లు: కుంకలగుంటలోని శ్రీకార్యసిద్ధి వినాయకస్వామి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. ఎస్‌ఐ చల్లా సురేష్ కథనం ప్రకారం.. ఆలయంలో శనివారం రాత్రి పూజలు ముగించుకున్న పూజారి కారంపూడి రాఘవాచార్యులు ప్రధాన గేటుకు తాళాలు వేసి వెళ్లారు. బుధవారం ఉదయం 6గంటల సమయంలో ఆలయ ప్రాంగణం శుభ్రం చేసేందుకు వచ్చిన మహిళకు గేటు తాళాలు పగలగొట్టి ఉండడంతోపాటు రెండు హుండీలు పగులగొట్టి ఆలయం వెనుక భాగంలో కన్పించడంతో ఆలయ నిర్వాహకులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఘటనాస్థలానికి పోలీసులతోపాటు క్లూస్‌టీం చేరుకొని ఆధారాలు సేకరించారు. ప్రధాన గేటు తాళాలు పగులగొట్టిన దుండగులు ఆలయంలోని రెండు హుండీలను వెనుకభాగానికి తీసుకువెళ్లి అందులోని సుమారు రూ.45వేల అపహరించారు. అక్కడి నుంచి వెళ్తూ ఆలయానికి కొద్దిదూరంలోనే ఇంటి వద్ద నిలిపి ఉన్న బజాజ్ ప్లాటినా ద్విచక్ర వాహనం, సెల్‌ఫోన్ కూడా అపహరించారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చల్లా సురేష్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment