యడ్లపాడు: ఇంట్లో ఒంటరిగా ఉన్న వద్ధురాలి మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని యువకుడు తెంచుకుపోయిన ఘటన బుధవారం జరిగింది. మండలంలోని సందెపూడి గ్రామానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు ఊటుకూరి అనసూయమ్మ ఇంట్లో ఒంటరిగా మంచంపై నిద్రిస్తుండగా బుధవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వచ్చి మీ అబ్బాయితో పనుంది ఇంట్లో ఉన్నాడా అంటూ అడిగారు. లేడని అనసూయమ్మ చెప్పడంతో అయితే పెన్ను పేపర్ ఇవ్వండి మా ఫోన్ నంబర్ రాసిస్తాం. వచ్చాక అబ్బాయి చేత ఫోన్ చేయించండి అంటూ నమ్మ బలికారు. మంచం మీద ఉన్న వృద్ధురాలు కిందికి దిగి పేపరు పెన్నును వెతికే క్రమంలో ఆమె మెడలో ఉన్న మూడు సవర్ల బంగారు గొలుసును ఇద్దరూ లాక్కొని పరారయ్యారు. దీంతో బాధితులు యడ్లపాడు పోలీసులను ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment