ఏఐ రాకతో ఫార్మా పరిశోధనలు విస్తృతం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఫార్మసీ కళాశాలలో మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్ ఇన్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్‌మెంట్ అనే అంశంపై రెండు రోజులు జాతీయ సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె.గంగాధరరావు ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ... మారుతున్న ఆహార అలవాట్ల వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియపరచడంలో ఫార్మసిస్టులు కీలక పాత్ర పోషించాలన్నారు. ముఖ్య వక్తగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఉన్న మంగళయాటన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు మాట్లాడుతూ కృత్రిమ మేధతో ఆధునిక పరిశోధన రంగం వేగవంతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. భారత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఐ.బాలకృష్ణ మాట్లాడుతూ.. సమాజాభివృద్ధికి తోడ్పడే ఆవిష్కరణలు చేయాలని తెలిపారు. బెంగళూరులోని ఆల్ అమీన్ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎండీ సలాహుద్దీన్ ఔషధాల అభివృద్ధి ప్రక్రియ వేగవంతమైందని వివరించారు. సదస్సు డైరెక్టర్ డాక్టర్ డి. రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుంచి 800 మంది విద్యార్థులు పాల్గొన్నారన్నారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ఎ.ప్రమీల రాణి అధ్యక్షత వహించారు. సదస్సులో రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం, కో కన్వీనర్ డాక్టర్ అన్నపూర్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.సుజన, కోశాధికారి డాక్టర్ కేఈ ప్రవల్లిక, జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.మస్తానమ్మ, కె. విజయ్ కిషోర్, తెనాలిలోని ఏఎస్‌ఎన్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె .వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment