రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
నరసరావుపేట: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రజాసంఘాల నాయకులు కోరారు. బుధవారం వారు లింగంగుంట్లలోని 200 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించారు. అనంతరం డెప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతికి వినతిపత్రం అందజేశారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం (పీడీఎం) సీనియర్ నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసీయూ ప్రారంభించకపోవడం వల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులకు వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. రోగులకు మందులూ అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రోగులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు వి.కోటానాయక్ మాట్లాడుతూ రోగులకు సరైన వైద్యం అందడం లేదని విమర్శించారు. రోగులను గుంటూరు జీజీహెచ్‌కు రెఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. వెంటనే అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని ఇక్కడ నియమించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నాయకులు నల్లపాటి రామారావు, జిల్లా అధ్యక్ష. కార్యదర్శులు షేక్ మస్తాన్‌వలి, జి.రామకృష్ణ, బీసీ సంఘం నాయకులు శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment