స్కేటింగ్‌లో మెరిసిన చిన్నారులు
తాడేపల్లి రూరల్ : తాడేపల్లి పట్టణ పరిధిలోని డోలాస్‌నగర్‌కు చెందిన బాలుడు మెరుగుపాల ఆశిష్, ఉండవల్లికి చెందిన విద్యార్థి సందు కోటేశ్వర్ స్కేటింగ్‌లో ప్రతిభ చాటారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. స్ధానికులు బుధవారం వారిని అభినందించారు. డోలాస్‌నగర్‌కు చెందిన మెరుగుపాల ఆశిష్ 11, 14 సంవత్సరాల వయస్సు కలిగిన స్కేటింగ్ కేటగిరీలో జాతీయస్థాయిలో గోల్డ్ మెడల్ సాధించాడు. సందు కోటేశ్వర్ 9–11 సంవత్సరాల విభాగంలో జాతీయ స్థాయిలో సత్తా చాటి స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. మూడు సంవత్సరాల నుంచి కోటేశ్వర్ జాతీయ స్థాయిలో పలు పోటీల్లో పతకాలు సాధిస్తూ తన సత్తా చాటుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment