‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ పోస్టర్ ఆవిష్కరణ
గురువారం శ్రీ 12 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు
ఈ నెల 13వ తేదీన ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ అనే కార్యక్రమం నిర్వహించనున్నారు. సంబంధిత పోస్టర్లను బుధవారం మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం పర్యటనలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు ఆవిష్కరించారు.
– మేడికొండూరు
గుంటూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ‘అన్నదాతకు అండగా వైఎస్సార్ సీపీ’ పోస్టర్లు ఆవిష్కరించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్ బాబు), తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా పాల్గొన్నారు. – పట్నంబజార్
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment