14న ఉమ్మడి జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
బాపట్ల: ఉమ్మడి గుంటూరు జిల్లా 50వ జూనియర్స్ బాలుర, బాలికల కబడ్డీ జట్ల ఎంపికలను ఈ నెల 14న నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మంతెన సుబ్బరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేటలోని వాగ్దేవి జూనియర్ డిగ్రీ కళాశాలలో ఆ రోజు ఉదయం 9 గంటలకు ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు వెంట ఆధార్ కార్డు తీసుకురావాలని ఆయన సూచించారు.
సౌదీ అరేబియాలో
నర్సింగ్ ఉద్యోగావకాశాలు
బాపట్ల: బీఎస్సీ నర్సింగ్, పోస్టు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకున్నవారికి సౌదీ అరేబియాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి డి. విక్టర్‌బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18– 40 సంవత్సరాల్లోపు వారు ఈ నెల 15వ తేదీలోగా జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థలో పేర్లు రిజి స్ట్రేషన్ చేయించుకోవాలని ఆయన సూచించారు. ఏడాదిన్నరపాటు ఏదైనా హాస్పిటల్‌లో పనిచేసిన అనుభవంతోపాటు సౌదీ అరేబియాలో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 89788 86348, 98666 37945, 99888 53335 ఫోను నంబర్లలో సంప్రదించాలని కోరారు.
యార్డుకు
51,004 బస్తాల మిర్చి
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 51,004 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 49,509 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి రూ. 15,200 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగ, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.7,500 నుంచి 16,500 వరకు లభించింది. ఏసీ కామన్ రకం మిర్చి రూ. 7,500 నుంచి రూ. 14,500 వరకు లభించింది. ఏసీ ప్రత్యేక రకం రూ. 7,500 నుంచి రూ. 16,500 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు ధర పలికింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 42,119 బస్తాల మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వి.ఆంజనేయులు తెలిపారు.
దుర్గమ్మకు కానుకగా
బంగారు నత్తు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువైఉన్న దుర్గమ్మకు విజయనగరం జిల్లాకు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విలువైన బంగారు నత్తును కానుకగా సమర్పించారు. చీపురుపల్లికి చెందిన వేలూరి అమోఘ్ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వచ్చారు. సుమారు 10.5 గ్రాముల బంగారం, ఎరుపు, పచ్చ రాళ్లు పొదిగిన నత్తును దేవస్థాన అధికారులకు అందజే శారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ డీఈఓ రత్నరాజు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మోపిదేవి కార్తికేయుడికి రూ.96.77 లక్షల ఆదాయం
మోపిదేవి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 96.77 లక్షల ఆదాయం వచ్చిందని ఆలయ ఈఓ దాసరి శ్రీరామవరప్రసాదరావు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కృష్ణా జిల్లా దేవదాయశాఖ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు జరిగింది. 96 రోజులకు రూ.96.77 లక్షల నగదుతోపాటు 1.560 కిలోల వెండి, బంగారం 33.300 గ్రాములు, 37 అమెరికన్ డాలర్లు వచ్చాయని ఈఓ తెలిపారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ, పోలీస్ అధికారులు, ఆలయ సిబ్బంది, సేవా సమితి సభ్యులు, పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment