మానసిక ఉల్లాసానికి క్రీడలు దోహదం
నగరంపాలెం: క్రీడా పోటీలు శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్– గేమ్స్ మీట్ పోటీలను బుధవారం జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం విధుల్లో నిమగ్నమయ్యే పోలీసులకు మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు క్రీడలు దోహదం చేస్తాయని, నాయకత్వ లక్షణాలు కూడా అలవాటు అవుతాయని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీ వరకు పోటీలు జరుగుతాయని తెలిపారు. 8 విభాగాల (ఆరు సబ్ డివిజన్లు, ఏఆర్, హెడ్ క్వార్టర్ విభాగం–1) నుంచి సుమారు 150 మంది సత్తా చాటేందుకు పోటీ పడుతున్నారు. జిల్లా ఏఎస్పీలు జీవీ రమణమూర్తి (పరిపాలన), కె.సుప్రజ (క్రైమ్), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్ పోలీస్ స్పోర్ట్స్–గేమ్స్ మీట్ ప్రారంభం
Comments
Please login to add a commentAdd a comment