కంటైనర్‌ను ఢీకొన్న లారీ
మేదరమెట్ల: పేలుడు పదార్థాల లోడుతో వెళుతున్న ఆర్మీకి చెందిన కంటైనర్‌ను వెనుక నుంచి బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొన్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. రెండు గంటల ప్రాంతంలో కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం సమీపంలో ఢీకొన్న లారీ నుంచి మంటలు రావడంతో స్థానికలు అద్దంకి అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది మంటలను అదుపు చేసి క్యాబిన్‌లో ఉన్న డ్రైవర్‌ను బయటకు తీశారు. ముందున్న కంటైనర్ మహారాష్ట్ర నుంచి చైన్నెకు ఆర్మీకి చెందిన పేలుడు పదార్థాలతో మరో 11 కంటైనర్‌లతోపాటు బయలు దేరింది. కంటైనర్లు బొడ్డువానిపాలెం వద్ద బంకులో పెట్రోలు కొట్టించుకునేందుకు రోడ్డు పక్కన ఆగాయి. అదే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో నిలిపిన మిగిలిన కంటైనర్లను కిలోమీటరు దూరంలోకి తీసుకెళ్లి ఆపుకొన్నారు. మేదరమెట్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకున్నారు.
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం పేలుడు పదార్థాల లోడుతో కంటైనర్
Comments
Please login to add a commentAdd a comment