జీడీసీఏకు తాత్కాలిక కమిటీ నియామకం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్‌కు ముగ్గురు సభ్యుల తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేస్తూ ఏసీఏ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న కమిటీతోపాటు గతంలో ఉన్న కమిటీల మద్య కొంత వివాదం నేపథ్యంలో గత నెల 29, 30వ తేదీల్లో ఏసీఏ విచారణ జరిపింది. దీంతో వివాదాలు పరిష్కారమయ్యే వరకు గుంటూరుకు చెందిన మాజీ రంజీ, దేవదర్ ట్రోఫీ క్రికెటర్లు వేముల మనోజ్ సాయి, బోడా సుధాకర్ యాదవ్‌తోపాటు న్యాయవాది, మాజీ క్రికెటర్ ఉమ్మడిశెట్టి మహతి శంకర్‌లను కమిటీ సభ్యులుగా నియమించింది. ఈ సందర్భంగా మనోజ్ సాయి, మహతి శంకర్‌లు మాట్లాడుతూ.. ఏసీఏ ఆదేశాల మేరకు తాము పనిచేస్తామన్నారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్ క్రీడా మైదానంలో అండర్–12 బాలుర జిల్లా జట్టు ఎంపిక నిర్వహిస్తామన్నారు.
ఉరుకులు పరుగులతో కట్టేతలు
నగరం: ఖరీప్ సీజన్‌లో సాగు చేసిన వరి పంట చేతికందే తరుణంలో వాతావరణంలో మార్పులతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమవ్వడంతో కోతలు కోసిన రైతుల గుండెల్లో ఆందోళన నెలకొంది. మండలంలోని పలు గ్రామాల్లో 3వేల ఎకరాలల్లో దాకా వరి పంట ఓదెల రూపంలో ఉంది.ఈ తరుణంలో కారు మబ్బులు పట్టి చిరు జల్లులు పడుతుండటంతో రైతులు హడావుడిగా కట్టేతలు కడుతున్నారు. రైతుల ఆందోళన, వాతావరణంలోని మార్పులను ఆసరా చేసుకుని కూలీలు ఒక్కసారిగా రేట్లు పెంచేశారు. వరి కట్టేతలకు ఎకరానికి సాధారణ పరిస్థితులలో రూ. 5,000 నుంచి రూ. 5,500 వరకు ఉండేది. ఇప్పుడు ఎకరానికి రూ. 7,000 నుంచి రూ. 7500కు చేరింది.
అంగలేరు వాగులో పడి
యువకుడి మృతి
శావల్యాపురం: మండలంలోని కొత్తలూరు గ్రామంలో గేదెలను పొలానికి తోలుకుని వెళుతుండగా మార్గమధ్యంలో అంగలేరు వాగులో పడి యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు గ్రామానికి చెందిన దావులూరి హరీష్ (20) గేదెలను పొలానికి మేత కోసం తోలుకొని వెళుతుండగా గ్రామ సమీపంలో ఉన్ననటువంటి అంగలేరు వాగు మధ్యలో ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్‌లో ప్రమాదవశాత్తు పడిపోయి మృతి చెందినట్లు తెలిపారు. ఘటన స్థలాన్ని ఎస్‌ఐ లేళ్ళ లోకేశ్వరరావు, వీఆర్వో ఉప్పు లూరి మంగయ్య పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment