రైతులకు మిగిలింది కన్నీరే! | - | Sakshi
Sakshi News home page

రైతులకు మిగిలింది కన్నీరే!

Published Thu, Dec 12 2024 9:30 AM | Last Updated on Thu, Dec 12 2024 9:31 AM

రైతుల

రైతులకు మిగిలింది కన్నీరే!

కూటమి పాలనలో వంచనకు గురవుతున్న అన్నదాతలు

మేడికొండూరు/పెదకాకాని/శలపాడు (చేబ్రోలు):

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల కంట పాలకులు కన్నీరు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలో జంగంగుంట్లపాలెం గ్రామంలో తాడికొండ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్‌ బాబు)తో కలిసి అంబటి రాంబాబు బుధవారం పర్యటించారు. పెదకాకాని మండలంలోని వెంకట కృష్ణాపురం గ్రామంలో, చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో అంబటి రాంబాబు, పొన్నూరు నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పర్యటించి, స్థానిక రైతుల ఇబ్బందులు తెలుసుకున్నారు.

పెట్టుబడి సాయం దిక్కే లేదు...

ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రైతులు నష్టపోతున్న తీరును వివరించారు. సూపర్‌ సిక్స్‌ హామీలలో భాగంగా అన్నదాత సుఖీభవ పేరిట ఏటా రూ.20 వేల ఆర్థిక సహాయం చేస్తానన్న చంద్రబాబు అధికారం చేపట్టి ఆరు నెలలు గడుస్తున్నా రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్లో రూ. 10,700 కోట్లు కేటాయించాల్సి ఉండగా.. అసలు ఆ ప్రస్తావనే చేయలేదని విమర్శించారు. దళారీ వ్యవస్థతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతుల నుంచి 10 శాతం మాత్రమే ధాన్యం కొనుగోలు చేసిందని తెలిపారు. దళారులు తక్కువ ధరకు ధాన్యం కొని రైతులను మోసం చేస్తున్నారన్నారు. రైతులను ఎన్నిసార్లు మోసం చేస్తావయ్యా చంద్రబాబు.. అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహాన్ని ప్రతి రైతు నిలదీయాలని పిలుపునిచ్చారు. ధాన్యం బాగున్నా అధికారులు కొనుగోలు చేయడం లేదని, తేమ శాతం సాకుగా చూపుతున్నారని పార్టీ నాయకులకు రైతులు తెలిపారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని అంబటి తెలిపారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. పలు ప్రాంతాల్లో కూటమి నాయకులే దళారులుగా మారి తక్కువ ధరకు రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు కొనుగోలు చేశామన్నారు. రైతులతో కలిసి వరి పొలాలు, ఆరబెడుతున్న ధాన్యాన్ని పరిశీలించారు. ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. వీటిలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. అనంతరం రైతు ర్యాలీ పోస్టర్లను ఆవిష్కరించారు. జంగంగుంట్లపాలెం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీటీసీ కందుల సిద్దయ్య, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు తాళ్లూరి వంశీకష్ణ, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ బాజీ, రాష్ట్ర కార్యదర్శి షేక్‌ మస్తాన్‌ వలి, జంగంగుంట్ల పాలెం గ్రామ సర్పంచ్‌ కళ్లి శ్రీదేవి సాంబిరెడ్డి, కో ఆప్షన్‌ మెంబర్‌ చంటి బాజీ, కిషోర్‌ రెడ్డి, కోటిరెడ్డి, లూర్ధు రాజు, రసూల్‌, అబ్బాస్‌, ముత్యాల బాలస్వామి, అల్లూ శ్రీనివాసరెడ్డి, పల్లపు శ్రీను, పాములపాటి జయరావు, నాగుల్‌ మీరా, హేమలత రెడ్డి, ఉడత ప్రభాకర్‌, కొటికల దాసు, కొక్కెర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

వెంకట కృష్ణాపురంలో జరిగిన కార్యక్రమంలో మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ నిమ్మకాయల రాజనారాయణ యాదవ్‌, శివాలయం మాజీ చైర్మన్‌ అమ్మిశెట్టి శివశంకర్రావు, పార్టీ గ్రామ అధ్యక్షుడు కానుగోలు శంకరరావు, తోటకూర వెంకటేశ్వరరావు, అగతవరప్పాడు సర్పంచ్‌ పిట్టు శివకృష్ణారెడ్డి, నాయకులు గోళ్ళ జోసెఫ్‌, చాగంటి మురళీమోహన్‌రెడ్డి, ఉప్పలపాడు సొసైటీ అధ్యక్షుడు శివాబత్తుని దయానంద్‌, భీమవరపు విజయలక్ష్మి, చిలకా కిషోర్‌, తోటకూర సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

చేబ్రోలు మండలం శలపాడు గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ మన్నెం శిరీష, ఎంపీటీసీ యు. వెంకటేశ్వరరావు, జయపాల్‌రెడ్డి, పార్టీ నాయకులు మన్నెం వేణుగోపాలరావు, ఉయ్యూరు బాలచంద్రయ్య, పరిశా పూర్ణచంద్రరావు, ఆళ్ల శ్రీరామిరెడ్డి, శేషిరెడ్డి, శ్రీరెడ్డి, చందు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

హామీల అమలులో సర్కారు విఫలం

పొన్నూరు: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ విమర్శించారు. రైతులు కష్టపడి పండించి ధాన్యానికి మద్దతు ధర విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై వారికి అండగా నిలవాలని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 13వ తేదీన ‘అన్నదాతకు అండగా వైఎస్సార్‌ సీపీ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు మురళీకృష్ణ తెలిపారు. గుంటూరు కలెక్టర్‌ కార్యాలయం వద్ద రైతులతో భారీ ర్యాలీ, అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్‌ రూత్‌ రాణి, షేక్‌ నాజర్‌, వట్టిప్రోలు రంగారావు, సర్పంచ్‌ చుండూరు వీరయ్య, దేవరకొండ గోపి, షేక్‌ జాని, మూర్తిరాజు, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు శూన్యం వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెంలో పర్యటన పెదకాకాని మండలం వెంకట కృష్ణాపురంలోనూ ధాన్యం పరిశీలన రైతుల సమస్యలు తెలుసుకుని ఓదార్చిన నాయకులు రేపు అన్నదాతకు అండగా వైఎస్సార్‌ సీపీ భారీ ర్యాలీ

జయప్రదం చేయాలని పిలుపు

పట్నంబజారు: ఈ నెల 13వ తేదీన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రైతన్నల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసే కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు, రైతులు జయప్రదం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు బుధవారం బృందావన్‌ గార్డెన్స్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా సమన్వయకర్తలు, ముఖ్య నేతలు, రైతు నేతలతో సభా కార్యక్రమం జరిగింది. వినతి పత్రాల కార్యక్రమానికి సంబంధించి పోస్టర్లు ఆవిష్కరించారు. దీనిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు, పార్టీనగర అధ్యక్షుడు, డెప్యూటీ మేయర్‌, తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు (డైమండ్‌ బాబు), తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్‌ నూరిఫాతిమా, నేతలు నిమ్మకాయల రాజనారాయణ, షేక్‌ మస్తాన్‌ వలి, మండేపూడి పురుషోత్తం, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, ఆళ్ల రవిదేవరాజ్‌, పార్టీ నేతలు, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నేతలు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రైతులకు మిగిలింది కన్నీరే!1
1/1

రైతులకు మిగిలింది కన్నీరే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement