వీవీఐటీని సందర్శించిన అశోక్ గజపతిరాజు
పెదకాకాని: కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు మంగళవారం నంబూరు వీవీఐటీ కళాశాలను సందర్శించారు. గుంటూరు విజ్ఞాన మందిరంలో జరిగిన విజయనగరం మహారాజు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి వేడుకలకు పూసపాటి హాజరయ్యారు. వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల 33వ పుస్తక ప్రచురణ పూసపాటి రాజుల యొక్క పూర్వోత్తరం హాకీకత్తు పూసపాటి విజయరామరాజు గ్రంథం ఆవిష్కరించిన అనంతరం వీవీఐటీ కళాశాలను సందర్శించారు. పూసపాటి అశోక్ గజపతి రాజుకు వీవీఐటీ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ స్వాగతం పలికారు. జనచైతన్య వేదిక సహకారంతో ప్రచురించిన ఈ పుస్తకంలో పూసపాటి వారు ఏవిధంగా విజయనగం రాజులు అయ్యారనేది సంపాదకుడు మోదుగుల రవికృష్ణ పొందుపరిచారు. అశోక్ గజపతిరాజు వీవీఐటీ ఇప్పటి వరకు ప్రచురించిన పుస్తకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వీవీఐటీ వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, సెక్రటరీ సూర్యదేవర బదరీప్రసాద్, జాయింట్ సెక్రటరీ మమిళ్లపల్లి శ్రీకృష్ణ, ప్రిన్సిపల్ డాక్టర్ మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment