చైన్ స్నాచర్ల్ల హల్‌చల్
తాడేపల్లి రూరల్: రాష్ట్రపతి మంగళగిరికి రావడంతో విజయవాడ – గుంటూరు మార్గంలో మంగళవారం బందోబస్తుకు పోలీసులు వెళ్లారు. ఈ హడావుడిలో ఉన్న పోలీసులను గమనించిన చైన్ స్నాచర్లు మంగళవారం నిమిషాల వ్యవధిలో రెండు ప్రాంతాల్లో మహిళల మెడలోని బంగారు చైన్‌లు లాక్కొని పల్సర్ బైక్‌పై పరారయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం... తాడేపల్లి వైఎస్సార్ సెంటర్ (కొత్తూరు) ఆంజనేయస్వామి గుడి సమీపంలో నివాసముండే దొంతిరెడ్డి సుగుణ (60) రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్నారు. ఇద్దరు యువకులు పల్సర్ బైక్‌పై వచ్చి ఆమె మెడలోని నాలుగు సవర్ల బంగారపు నానుతాడును తెంచుకు వెళ్లారు. ఈ ఘటన ఉదయం 8.30 నిమిషాలకు జరిగింది. 8.58 నిమిషాలకు కుంచనపల్లి బైపాస్‌రోడ్‌లోని ఆంధ్రరత్న పంపింగ్ స్కీం రోడ్డులో బైపాస్ వైపు నడుచుకుంటూ వెళుతున్న స్రవంతి మెడలోని 4 సవర్ల బంగారు చైన్‌ను అదే దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటనలో సుగుణ కింద పడడంతో గాయాలు అయ్యాయి. మహిళల వద్ద వాహనాలు టర్న్ తీసుకుంటున్నట్లు నటించి స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఒక వ్యక్తి హెల్మెట్ పెట్టుకోగా, రెండవ వ్యక్తి ముఖానికి మాస్క్ పెట్టుకున్నాడు. స్నాచర్లు బైపాస్‌రోడ్డు ఎక్కి పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న ప్రాంతం నుంచి పరారయ్యారు. గత నెల రోజుల్లో తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ తరహా ఘటనలు మూడు జరిగాయి. నెల క్రితం వైఎస్సార్ సెంటర్ కొత్తూరులో మహిళ మెడలో చైన్ స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో దుండగులు పరారయ్యారు.
తాడేపల్లి స్టేషన్ పరిధిలో రెండు చోట్ల గొలుసు దోపిడీలు రోడ్డుపైకి రావాలంటేనే భయపడుతున్న మహిళలు
Comments
Please login to add a commentAdd a comment