రోడ్డు ప్రమాదాలు, ప్రకృతి విపత్తుల్లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సకాలంలో మెరుగైన చికిత్స అందించి ప్రాణాలు కాపాడేందుకు గుంటూరు జీజీహెచ్‌లో క్యాజువాల్టీ ఉంది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కేటాయించిన ట్రామా కేర్ సెంటర్, గత ప్రభుత్వంలో నూతనంగా మంజూరు చేసిన ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగం కూడా ఉన్నాయి. చెప్పుకోవడానికి ఇన్ని ఉన్నా ఇక్కడ చికిత్స కోసం వచ్చే బాధితులకు అరకొర వైద్య సేవలే అందుతున్నాయి. చికిత్సలు సకాలంలో లభించక ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడమో, ప్రాణాలు కోల్పోవడమో జరుగుతోంది.
గుంటూరు జీజీహెచ్‌లో తప్పని ఎదురు చూపులు మూడు వైద్య విభాగాలున్నా ప్రయోజనం శూన్యం ప్రాణాలు కాపాడే ఎమర్జెన్సీ వార్డు నిర్వహణపై విమర్శలు పాలకులు దృష్టి సారిస్తేనే రోగుల ప్రాణాలకు భరోసా
Comments
Please login to add a commentAdd a comment