ఏపీపీఎస్‌ఎం అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్
సత్తెనపల్లి: ఏపీ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్‌మెంట్(ఏపీపీఎస్‌ఎం) అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సత్తెనపల్లికి చెందిన భవనం నాగిరెడ్డి, రాష్ట్ర అడ్వైజర్‌గా క్రోసూరుకు చెందిన తిప్పిరెడ్డి జైనేంద్రారెడ్డి ఎంపికయ్యారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గాల ప్రైవేట్ పాఠశాల డైరెక్టర్లతో గురువారం సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు పీజే ధన్ హాజరై మాట్లాడారు. ఈనెల 29న కేఎల్ యూనివర్సిటీలో రాష్ట్ర సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసినట్టు వివరించారు. ఈ సమావేశం విజయవంతంపై చర్చించారు. సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరవుతారని, ప్రైవేటు పాఠశాలల సమస్యలపై చర్చిస్తారని వెల్లడించారు. సత్తెనపల్లి పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రైవేటు పాఠశాల డైరెక్టర్లు అందరూ హాజరు కావాలని కోరారు. జిల్లా నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎంపికై న భవనం నాగిరెడ్డి, రాష్ట్ర అడ్వైజర్‌గా ఎంపికై న తిప్పిరెడ్డి జైనేంద్రారెడ్డిలను పూలమాలలు, దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment