ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల ధర్నా
నరసరావుపేట: విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ విరమించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక బరంపేటలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కార్యాలయం గేటు ముందు ఏపీ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ‘ధర్నా‘ నిర్వహించారు. ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఎన్‌సీసీఓఇఇ పిలుపు మేరకే స్పంధించిన విద్యుత్ ఉద్యోగులు ధర్నాలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి, జేఏసీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. కార్యాచరణ సమితి సభ్యులు ఆర్ బంగారయ్య, జేఏసీ నాయకులు కె.రవిశంకర్, డెప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాదరావు కేవీఆర్‌ఎస్ శ్రీనివాసరావు, అన్నీ వర్గాల విద్యుత్ ఉద్యోగులు, మహిళ ఉద్యోగులూ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment