డ్రోన్ కెమెరాలతో నిఘా
నగరంపాలెం: జిల్లాలో జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు, వ్యాపార కార్యకలాపాలతో కిక్కిరిసే ఏరియాలు, తరుచూ దొంగతనాలు జరిగే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) సమావేశ మందిరంలో శుక్రవారం సీసీఎస్ (సెంట్రల్ క్రైం సిస్టం) ఉన్నతాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలోని క్రైం పోలీసులు మరింత సమర్థంగా విధులు నిర్వహించాలని అన్నారు. సీసీఎస్ పోలీసులు చురుగ్గా ఉంటే దొంగల కదలికలు తగ్గుతాయని చెప్పారు. రాత్రివేళల్లో సంచరించే వ్యక్తుల వేలి ముద్రలను మొబైల్ ఫింగర్ ప్రింట్ స్కానింగ్ పరికరాలతో సేకరించాలని చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కేసులు ఛేదించాలని అన్నారు. సమావేశంలో సీసీఎస్ డీఏఎస్పీ శివాజీరాజు, సీఐలు (డీసీఆర్‌బీ) నరసింహారావు, (సీసీఎస్) డి.వెంకన్నచౌదరి, సుబ్బారావు, అల్తాఫ్ హుస్సేన్, నరేష్‌కుమార్ (సోషల్ మీడియా), నిస్సార్‌బాషా (ఐటీ కోర్) , సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment