క్రీడాస్ఫూర్తిని చాటేలా పోటీల నిర్వహణ
నగరంపాలెం: క్రీడా స్ఫూర్తిని చాటేలా పోటీలు నిర్వహించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి అన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న జిల్లా స్పోర్ట్స్– గేమ్స్ మీట్ శుక్రవారం ముగిసింది. ముఖ్య అతిథిగా రేంజ్ ఐజీ మాట్లాడుతూ నిత్యం బందోబస్త్, ఇతరత్రా విధుల నిమిత్తం బిజీగా ఉండే పోలీసులకు జిల్లా వార్షిక క్రీడా పోటీలు నిర్వహించడం గొప్ప విషయమని చెప్పారు. దీనిని కొనసాగించాలని అన్నారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ఎనిమిది విభాగాలుగా సుమారు 180 మంది సీ్త్ర, పురుష క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. గుంటూరు తూర్పు ట్రాఫిక్ సీఐ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలోని హెడ్ క్వార్టర్ టీం ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. తెనాలి సబ్ డివిజన్ టీంలోని 42 మంది మహిళలు, ఏఆర్ విభాగంలోని 36 మంది పురుషులు బంగారు పతకాలు సాధించారు. విజేతలకు ట్రోఫీ, బంగారు పతకాలను అందించారు. శిక్షణ ఐపీఎస్ అధికారిణి శ్రద్ధ, జిల్లా ఏఎస్పీలు హనుమంతు (ఏఆర్), రమణమూర్తి (పరిపాలన), ఏటీవీ రవిబాబు (ఎల్‌ఓ), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, ఆర్‌ఐలు శివరామకృష్ణ, ఉదయభాస్కర్, శ్రీహరిరెడ్డి, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. కోచ్‌లు, రిఫరీలను ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment