కక్షిదారుల స్వచ్ఛంద ప్రక్రియ మధ్యవర్తిత్వం
నగరంపాలెం: మధ్యవర్తిత్వం పూర్తిగా కక్షిదారుల స్వచ్ఛంద ప్రక్రియ అని జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వై.వి.ఎస్.బి.జి.పార్థసారథి అన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని న్యాయమూర్తులకు మధ్యవర్తిత్వంపై జిల్లా కోర్టు ఆవరణలోని డీజే హాల్‌లో నిర్వహిస్త్తున్న నలభై గంటల శిక్షణ శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పార్థసారథి మాట్లాడుతూ సమస్య పరిష్కారంలో కక్షిదారులే కీలక పాత్రధారులని అన్నారు. న్యాయమూర్తులకు శిక్షణ ఇచ్చిన ఆర్.రత్నతార, సత్యరావు (తమిళనాడు)లను సత్కరించారు. సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్), సంస్థ జిల్లా కార్యదర్శి టి.లీలావతి, న్యాయమూర్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment