లక్ష్మీపురం: మహా కుంభమేళా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డివిజన్ సీనియర్ డీసీఎం ప్రదీప్‌కుమార్ శుక్రవారం ఈ విషయం తెలిపారు.
●నంబర్ 07701 గుంటూరు – ఆజంగడ్ రైలు జనవరి 25వ తేదీన, 07702 ఆజంగడ్ – గుంటూరు రైలు 26న నడపనున్నట్లు తెలిపారు. గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, కొండపల్లి, ఖమ్మం, వరంగల్, రామగుండం, మంచిర్యాల, కాగజ్‌నగర్, బలార్షా, చంద్రాపూర్, నాగపూర్ మీదుగా ఇవి ప్రయాణించనున్నాయి.
●నంబర్ 07719 గుంటూరు – గయా రైలు జనవరి 25వ తేదీన, 07720 గయా – గుంటూరు రైలు 27న నడవనున్నాయి. గుంటూరు, విజయవాడ, కొండపల్లి, మధిర, ఖమ్మం, డోర్నకల్ జంక్షన్, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, బలార్షా, చంద్రాపూర్, నాగ్‌పూర్ మీదుగా ఇవి రాకపోకలు సాగించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment