వైఎస్ జగన్ బర్త్‌డే శుభాకాంక్షల ఫ్లెక్సీల తొలగింపు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కార్పొరేషన్ అధికారులు అత్యుత్సాహం చూపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అభిమానులు, నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను, జెండాలను శుక్రవారం సిబ్బంది తొలగించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు డిసెంబర్ 21వ తేదీన జరుపుకొంటుండగా.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు కనకదుర్గ వారధి, బైపాస్‌రోడ్, సర్వీస్‌రోడ్, తాడేపల్లి రోడ్డులోని ఇతర ప్రాంతాల్లో ఆయన ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేశారు. పుట్టా ప్రతాప్‌రెడ్డి అనే అభిమాని ఏకంగా 2 వేల ఫ్లెక్సీలను, జెండాలను కనకదుర్గ వారధి వెంబడి ఏర్పాటు చేస్తే.. వాటిని పూర్తిగా తొలగించారు. కూటమి ప్రభుత్వం కక్షపూరిత వైఖరిలో భాగంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతోందంటూ వైఎస్సార్‌సీపీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, జెండాలను ఏర్పాటు చేసిన దగ్గరే కూటమి నాయకులు ఏర్పాటు చేసిన అనేక ఫ్లెక్సీలు, జెండాలున్నాయని గుర్తుచేశారు. వాటిని తొలగించకుండా అధికారులు పక్షపాతం చూపుతున్నారంటూ మండిపడ్డారు.
నగర పాలక సంస్థ అధికారుల అత్యుత్సాహం కూటమి నేతల ఫ్లెక్సీల తొలగింపునకు వెనకడుగు వైఎస్సార్ సీపీ నేతల మండిపాటు
Comments
Please login to add a commentAdd a comment