400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
చీరాల: చీరాల రామ్‌నగర్‌లోని ఆర్టీసీ గ్యారేజి వెనుక పరిసర ప్రాంతాలలో నాటుసారా తయారీకి ఉపయోగించే 400 లీటర్ల బెల్లం ఊటను మంగళవారం ఎకై ్సజ్ పోలీసులు ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆదేశాల మేరకు జిల్లా ఏఈఎస్, ఈస్‌టీఎఫ్ బాపట్ల, చీరాల ఎకై ్సజ్ పోలీసులు సంయుక్తంగా మంగళవారం రామ్‌నగర్‌లోని చర్చి వెనుక గల పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారు చేయుటకు ఉపయోగించేందుకు డ్రమ్ములలో సిద్ధంగా ఉంచిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారు చేసే కఠిన చర్యలు తీసుకుంటామని ఎకై ్సజ్ సీఐ నాగేశ్వరరావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment