కార్యాలయాల్లో ఎస్పీ తనిఖీ
తెనాలి రూరల్: సాధారణ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ బుధవారం తెనాలి వచ్చారు. ఉదయం కొత్తపేటలోని తాలూకా సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించారు. పలు రికార్డులు పరిశీలించారు. డీఎస్పీ జనార్ధనరావు, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాసరావులతో మాట్లాడారు. తర్వాత డీఎస్పీ కార్యాలయానికి వెళ్లి రికార్డులను పరిశీలించారు. పలు పోలీస్ స్టేషన్ల సిబ్బందితోనూ ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడారు.
29న పవర్ లిఫ్టింగ్ పోటీలు
మంగళగిరి: గుంటూరు జిల్లా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ (మెన్ – ఉమెన్), బెంచ్ ప్రెస్ చాంపియషిప్ పోటీలు ఈ నెల 29వ తేదీన గుంటూరు ఏటీ అగ్రహారం 4వ లైనులో ఉన్న ది సెంట్రల్ స్కూల్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమ్మాకుల విజయ భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి షేక్ సంధానిలు బుధవారం తెలిపారు. పోటీల్లో పాల్గొనే పవర్ లిఫ్టర్లు వయసు ధ్రువీకరణ పత్రాలు తీసుకుని రావాలని పేర్కొన్నారు. 29న ఉదయం 7 గంటలకు పోటీలు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. ఇతర వివరాల కోసం 97008 44497, 93463 07979 ఫోను నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment