ఫిరంగిపురంలో క్రిస్మస్ వేడుకలు
ఫిరంగిపురం: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫిరంగిపురం బాల ఏసుదేవాలయ ప్రాంగణంలో మంగళవారం అర్థరాత్రి నిర్వహించాల్సిన వేడుకలను వర్షం వల్ల ఆలయంలో నిర్వహిస్తున్నారు. భక్తులకు ఎటువంటి అసౌర్యమూ కలుగకుండా ఉండేలా రాత్రి 11.30 గంటల నుంచి దివ్యపూజాబలి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిపై బాల ఏసుదేవాలయ విచారణ గురువులు ఎం.ఫాతిమా మర్రెడ్డి , గుడి పెద్దల ఆధ్వర్యంలో ప్రార్థనలు జరగనున్నాయి. ఆలయంలో క్రీస్తు జననాన్ని తెలియజేసేలా పశువుల పాకను అందంగా అలంకరించారు. పాక చుట్టూ విద్యుదీపాలు, నీటి కొలను సెట్టింగ్ ఏర్పాటు చేశారు.
తిరునాళ్లకు పటిష్ట భద్రత
క్రిస్మస్ సందర్భంగా గ్రామంలో నిర్వహించే బాల ఏసు ఆలయ తిరునాళ్లకు 138 మందితో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు సీఐ రవీంద్రబాబు తెలిపారు. సెయింట్‌పాల్స్ ఆడిటోరియంలో మంగళవారం పోలీసు సిబ్బందికి విధులు కేటాయించారు. తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ ఆదేశాల మేరకు పలు ప్రాంతాల స్టేషన్ల నుంచి వచ్చిన పోలీసులకు అవగాహన కల్పించారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. వాహనాల పార్కింగుకు మూడు ప్రాంతాలను నిర్ణయించినట్టు పోలీసులు వివరించారు. తేర్ల ఉత్సవానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో తాడికొండ సీఐ వాసు, మేడికొండూరు సీఐ నాగూల్ మీరా, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment