అక్రమ మద్యం విక్రయిస్తున్న పోలీసులు
నెహ్రూనగర్: చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని అతిక్రమించి జైలు పాలవుతున్నారు. గోవా రాష్ట్రానికి చెందిన మద్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి గుంటూరులో ఎక్కువ ధరకు అమ్మిస్తూ చివరకు ఎకై ్సజ్ సిబ్బందికి పట్టుబడ్డారు. గుంటూరు నగరంలోని పట్టాభిపురం ఇస్కాన్ టెంపుల్ వద్ద గోవా మద్యం అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు గుంటూరు–2 టౌన్ ఎకై ్సజ్ సిబ్బంది దాడి చేసి కుక్కమల్ల సురేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణ కుమారి చెప్పారు. గోవా మద్యం ఎక్కడి నుంచి వస్తుందని సురేష్‌ను విచారించగా నరసరావుపేట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కార్యాలయంలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శివకృష్ణ, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వాసుదేవరావు, నరసరావుపేటలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆనందరావులు తనకు గోవా మద్యం ఇస్తుంటారని, వారి తరఫున తాను ఎక్కువధరకు అమ్ముతానని సురేష్ ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. సురేష్ ఇచ్చిన సమాచారం మేరకు జిల్లా కోర్టు కాంపౌండ్‌లోని ఆర్‌అండ్‌బీ పాడుబడిన బంగ్లాలో పోలీసులు శివకృష్ణ, వాసుదేవరావు, ఆనంద్‌రావులు నిలువచేసి దాచి ఉంచిన 133 మద్యం సీసాలను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. వీరిని అరెస్ట్ చేశామన్నారు. వీరందరికీ గుంటూరుకు చెందిన టి.బాజీబాబు గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి అమ్ముతుంటాడు. అక్రమ మద్యం అమ్ముతున్నాడనే విషయంలో గత కొద్దిరోజుల క్రితం బాజీ బాబును(బాబీ) అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఎకై ్సజ్ సీఐ యశోదరా దేవి, ఎస్‌ఐలు మాధవి, సత్యనారాయణ, సిబ్బంది హనుమంతరావు, రాజు, శ్రీనివాసరావు, సూర్యనారాయణ, నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
నరసరావుపేటకు చెందిన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లను అదుపులోకి తీసుకున్న ఎకై ్సజ్ పోలీసులు 133 మద్యం సీసాలు స్వాధీనం
Comments
Please login to add a commentAdd a comment