27, 28 తేదీల్లో పౌరాణిక నాటక ప్రదర్శనలు
నగరంపాలెం: ఈనెల 27, 28 తేదీల్లో మార్కెట్ కూడలిలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు పౌరాణిక కళాకారుల సాంస్కృతిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లక శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం విజ్ఞాన మందిరంలో నాటక ప్రదర్శనల వాల్‌పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం 28వ వార్షికోత్సవాల్లో భాగంగా రెండు రోజులు ప్రదర్శనలు జరుగుతాయని అన్నారు. తొలి రోజు సాయంత్రం శ్రీరామాంజనేయ యుద్ధం (వార్‌సీను), మయసభ (దుర్యోధన ఏకపాత్ర), చింతామణి – భవాని సీను, పల్నాటి యుద్ధం (సీను), సత్యహరిశ్చంద్ర (అడవి సీను), రెండో రోజు పాండవోద్యోగం నుంచి (యుధిష్టిర ఏకపాత్ర), బాలనాగమ్మ (పకీరు సీను), రాజనర్తకి (ముఖ్యమైన సన్నివేశాలు), మయసభ దుర్యోధన ఏకపాత్ర, శ్రీకృష్ణ రాయబారం (సెంట్రల్ సీను), సత్యహరిశ్చంద్ర (అడవి సీను కాటి సీను వరకు) ప్రదర్శించనున్నట్లు తెలిపారు. డాక్టర్ ఎం.ఫర్నికుమార్ నిర్వహణలో పాత సినీ గీతాలాపన ఉందన్నారు. కళాభిమానులు, నాటక కళాకారులు హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చెన్నుపాటి కృష్ణారావు, సనిశెట్టి సాంబశివరావు, డాక్టర్ బీవీ.రమణ, శ్రీకాంత్, సూర్యనారాయణ, వెంకటప్పయ్య, అర్జునరావు, దర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment