పెనుగొండ సాహిత్య సేవలు ఆదర్శం
విజయవాడకల్చరల్: పెనుగొండ లక్ష్మీనారాయణ సాహిత్యసేవలను ఆదర్శంగా తీసుకోవాలని అభ్యదయ రచయితల సంఘం రాష్ట కార్యదర్శి వల్లూరి శివప్రసాద్ అన్నారు. అభో.విభో, కందాళం, జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో బందరురోడ్డులోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్న నాటకోత్సవాలు సామాజిక అంశాలను చాటుతున్నాయి. శనివారం నాటి కార్యక్రమంలో కథానాటిక ప్రదర్శనలు, అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణకు విశిష్ట సాహితీమూర్తి జీవితకాల సాధన పురస్కారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెనుగొండ ఆధ్వర్యంలో అభ్యుదయ రచయితల సంఘం ఉత్సాహంతో పరుగులు పెడుతోందన్నారు. నిర్వాహకులు పెనుగొండకు విశిష్ట సాహితీమూర్తి విశిష్ట సేవా పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు పురస్కారం ప్రధానం చేశారు. విడాకులు కావాలి, దేవ రాగం నాటికలు ప్రదర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment