బాల మేధస్సు.. సమాజ శ్రేయస్సు
గుంటూరు ఎడ్యుకేషన్ : తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు మెదడుకు పదును పెట్టారు. సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై తమ మేధస్సుతో పరిష్కారం చూపారు. పాత బస్టాండ్ సెంటర్లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల దీనికి వేదికై ంది. జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులు గైడ్ ఉపాధ్యాయుల సహకారంతో రూపొందించిన నమూనా ప్రాజెక్టులు ఆకట్టుకున్నాయి.
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థులు ఎంపిక
జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు డీఈవో సీవీ రేణుక ప్రశంసాపత్రాలు, జ్ఞాపిక బహూకరించారు. విజేతలు వీరే...
● గ్రూపు విభాగంలో కె.గౌరీనాథ్, షేక్ లతీఫ్ (జెడ్పీ హైస్కూల్, రావెల), ఎండీ అనీసాబేగం, ఇ. ఈర్షిత (శారదానికేతన్ హైస్కూల్, గుంటూరు), అక్షయ, లిఖిత (జెడ్పీ హైస్కూల్, మేడికొండూరు)
● వ్యక్తిగత విభాగంలో షేక్ నజ్మా (జెడ్పీ హైస్కూల్, నారాకోడూరు), ఎస్. పవన్‌దుర్గ (జెడ్పీ హైస్కూల్, ముట్లూరు), షేక్ సనా ఫిర్దోస్ (సీకే జూనియర్ కాలేజ్ హైస్కూల్, మంగళగిరి)
● ఉపాధ్యాయ విభాగంలో జి. శ్రీనివాసరావు (జెడ్పీ హైస్కూల్, జీజీ పాలెం), ఎన్. భాస్కరరావు (జెడ్పీ హైస్కూల్, సిరిపురం), కె. రామారావు (జెడ్పీ హైస్కూల్, వట్టిచెరుకూరు)
● క్విజ్ పోటీల్లో పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంటూరు, జెడ్పీ హైస్కూల్స్ అత్తోట, నారాకోడూరు
● బుక్ ఫెయిర్‌లో కె. వెన్నెల – ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, గుంటూరు; ఎన్. సౌమ్యచంద్ర, జెడ్పీ హైస్కూల్, వింజనంపాడు; షేక్ రుక్సానా, జెడ్పీ హైస్కూల్, కొప్పర్రు.
జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో
వినూత్న ప్రాజెక్టులకు రూపం
Comments
Please login to add a commentAdd a comment