ఆ ఐదుగురు మంచి మిత్రులు. అందరూ ఒకే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆదివారం కావడంతో సరదాగా ఈతకు వెళదామని నిర్ణయించుకున్నారు. ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత సుమారు 4.30 గంటల సమయంలో ఐదుగురు ఈతకు వెళ్లారు. పట్టణ శివారులో ఉన్న గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ముగ్గురు ఒకచోట, ఇద్దరు మరొకచోట ఈతకు దిగారు. ఇద్దరు గల్లంతు కాగా.. ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. గల్లంతైన ఇద్దరూ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది.
గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతైన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత శోకసంద్రంలో రెండు కుటుంబాలు
Comments
Please login to add a commentAdd a comment