క్రీడలపై పట్టు సాధిస్తేనే విజయం
పిడుగురాళ్ల రూరల్: విద్యార్థి దశలో ఏ క్రీడను ఎంచుకున్నా దానిపై పట్టు సాధిస్తేనే విజయం సాధ్యమని రోటరీ జిల్లా మాజీ గవర్నర్ వడ్లమాని రాజ్యలక్ష్మి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని గీతికా సీబీఎస్‌సీ స్కూల్‌లో జిల్లా స్థాయి రోటరీ ఇంట్రాక్ట్ స్పోర్ట్స్ మీట్ మంగళవారం నిర్వహించారు. 15 మండలాల నుంచి 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, త్రోబాల్ వంటి గేమ్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ... గెలుపోటములు సహజమని, ఓడిపోయినా పాఠాలు నేర్చుకొని విజయానికి కృషి చేయాలని అన్నారు. స్కూల్ చైర్మన్ బాలగంగాధర్‌రెడ్డి మాట్లాడుతూ... విద్యతోపాటు క్రీడలలో నైపుణ్యం సాధించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, డైరెక్టర్ వెంకట రామిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment