విజ్ఞాన్ – ఎన్‌ఐపీహెచ్‌ఎం మధ్య అవగాహన
చేబ్రోలు: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ – హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐపీహెచ్‌ఎం)ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ డైరక్టర్ జనరల్ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్, జాయింట్ డైరక్టర్ డాక్టర్ విధు కేపీలతో ఒప్పందానికి సంబంధించిన అవగాహన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన ఎన్‌ఈపీ–2020లో పొందుపరిచిన మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ (ఎంఈఆర్‌యు) కాన్సెప్ట్‌ను, అకడమిక్ ప్రోగ్రామ్స్‌ను, కరిక్యులమ్ డిజైన్‌ను చేస్తామన్నారు. అంతేకాకుండా ఫ్యాకల్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్, అకడమిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీ ఎక్స్‌చేంజ్ ప్రోగ్రామ్, హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్, పేటెంట్స్, ప్రాజెక్ట్‌లు, ఉమ్మడిగా పరిశోధనలు చేయడంతో పాటు డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లను సులభతరం చేయవచ్చునన్నారు. వీటితో పాటు విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలను అందించడం, ప్రాక్టికల్ ఇండస్ట్రీ అనుభవాన్ని అందించడంతో పాటు వృత్తిపరమైన వృద్ధిని పెంపొందిస్తామన్నారు. అంతేకాకుండా ఎన్‌ఐపీహెచ్‌ఎంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాస్టర్స్, పీహెచ్‌డీలు పూర్తి చేయడానికి కావలసిన సహకారాన్ని అందిస్తామన్నారు. ఎన్‌ఐపీహెచ్‌ఎం డీజీ డాక్టర్ సాగర్ హనుమాన్ సింగ్ మాట్లాడుతూ అధ్యాపకులను, విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్, డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment