వైభవంగా శ్రీహనుమాన్ చాలీసా
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం శ్రీపద్మావతి కల్యాణ మండపం వేదికపై మంగళవారం సర్వకార్య జయం హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ధార్మిక విజ్ఞాన పరిషత్, బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులు, ఆలయ పాలక మండలి సంయుక్త ఆధ్వర్యంలో జరిగాయి. విశేష హారతి అనంతరం భక్తులకు తీర్ధప్రసాద వితరణ చేపట్టారు. చిలకలూరిపేట ఈవూరిపాలెం భజన బృందం భక్తి శ్రద్ధలతో పారాయణ చేశారు. బృందావన శ్రీనివాసునికి 108 సువర్ణ అష్టదళ పద్మాల పూజ ఆలయ ప్రధాన పూజారి మాధవాచారి బృందం నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీహరి, ఆలయ పాలకమండలి అధ్యక్షులు సి.హెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు, సూర్యదేవర వెంకటేశ్వర్లు, పుట్టా ప్రభాకర్, పాలకవర్గం పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో శ్రీరామ అభిషేకం
నగరంపాలెం: స్థానిక మారుతీనగర్ శ్రీకంచి కామకోటిపీఠ మారుతీ దేవాలయం ప్రాంగణంలో శ్రీరామ మహా సామ్రాజ్య పట్టాభిషేకం పూజలు మంగళవారం నాలుగో రోజుకి చేరాయి. మిత్ర క్యాలెండర్ సౌజన్యంతో శ్రీసీతారామచంద్రస్వామి వారికి అభిషేకం నిర్వహించారు. శ్రీమద్రామాయణ పారాయణులు ఉదయం పారంభమై, సాయంత్రం వరకు కొనసాగాయి. రామాయణంలో పలు కాండలకు హోమం నిర్వహించారు. నీరాజన మహా మంత్రపుష్పాలు చేపట్టి, స్వామి వారికి దర్బారుసేవ అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యదర్శి తంగిరాల శ్రీనివాస్ పర్యవేక్షించగా, శ్రీరామ సేవా సమితి (వారణాసి) ఆధ్వర్యంలో జరిగాయి.
మాంటిస్సోరిలో ముగ్గుల పోటీలు
గుంటూరు ఎడ్యుకేషన్: శ్యామలానగర్‌లోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో మంగళవారం ముందస్తు సంక్రాంతి సంబరాల్లో భాగంగా విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థుల తల్లుల ఎంతో ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. కార్యక్రమంలో పాఠశాల అధినేత కేవీ సెబాస్టియన్, కరస్పాండెంట్ మంజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పుపై హర్షం
లక్ష్మీపురం: తల్లిదండ్రుల బాగోగులను పట్టించుకోని పిల్లలు ఆస్తి హక్కుకు అర్హులు కారని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడం స్వాగతించదగినదని విద్యావేత్త, విశ్లేషకులు ఆర్.సింగరయ్య అన్నారు. స్థానిక అరండల్‌పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇటువంటి తీర్పు రావడం ముదావహమన్నారు. సీనియర్ సిటిజన్స్ వెంకటరత్నం, సంస్థ కార్యదర్శి కొండాశివరామిరెడ్డిలు మాట్లాడారు.
బీమా సంస్థలను కేంద్రం నియంత్రించాలి
లక్ష్మీపురం: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించేటప్పుడు ఆయా కంపెనీలకు ఉండే ఆసక్తి, వేగం క్లయిమ్‌ల పరిష్కారంలో లోపిస్తుందని, బీమా క్లయిమ్‌లను వీలైనంత వేగంగా, పూర్తిగా పరిష్కారం అయ్యేలా ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలని వినియోగదారుల సంఘం కార్యదర్శి ముప్పాళ్ళ ప్రసాదరావు అన్నారు. స్థానిక అరండల్‌పేటలోని అవగాహన సంస్థ ఆధ్వర్యంలో బీమా సంస్థలపై ప్రభుత్వ పర్యవేక్షణ’ అన్న అంశంపై సదస్సు నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ఫోరం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment