స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి
లక్ష్మీపురం: గత 50 సంవత్సరాల నుంచి అనేక విభాగాలలో ప్రజలకు సేవలు అందిస్తున్న స్కీం వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ జాతీయ సమితి పిలుపులో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఏఓకు వినతిపత్రం అందించారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడా హనుమంతరావు మాట్లాడుతూ అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన పథకం లాంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లు అనేక సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. వారిని తక్షణమే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రూ.26వేలు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయ కక్ష సాధింపులు అరికట్టాలని, విధులలో మరణించిన వారికి రూ.5 లక్షలు ఇవ్వాలని, మట్టి ఖర్చుల నిమిత్తం రూ.20వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కోశాధికారి పుప్పాల సత్యనారాయణ, కొల్లి రంగారెడ్డి, అంగన్‌వాడీ యూనియన్ నాయకులు స్వరూప రాణి, భూషణ కుమారి, ఉదయలక్ష్మి, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment