‘దివ్య’ తేజస్సు
పెదకూరపాడు: కతోలిక్‌ల పుణ్యభూమి పాటిబండ్ల గ్రామంలో ముగ్గురు రాజులు దేవాలయ శత వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ఆధ్యాత్మిక సందడి నెలకొంది. వేలాదిగా తరలివస్తున్న రోమన్ కతోలికులు, వందలాదిగా తరలివచ్చిన మత గురువులు, మఠకన్యలు, విదేశీ భక్తులతో కోలాహలంగా మారింది. వార్షికోత్సవాల్లో భాగంగా రెండో రోజు నల్లపాడు సీనియర్ గురువులు రెవరెండ్ ఫాదర్ అల్లం శౌర్రెడ్డి పాటిబండ్ల గ్రామంలో పుట్టి వివిధ ప్రదేశాల్లో గురువులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న 60 మంది మత గురువులతో కలిసి ప్రత్యేక దివ్యబలిపూజ నిర్వహించారు. దాచేపల్లి విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ యేరువ బాలశౌర్రెడ్డి ప్రత్యేక సందేశాన్ని అందించారు. ఈ లోక ఆశలను వీడి, దేవుని ప్రేమలో నిలవాలని కోరారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన ముగ్గురు రాజులు దేవాలయం అనేక మందిని దేవుని సేవలో, ప్రేమలో నిలిపిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పుట్టి వివిధ ప్రాంతాల్లో దైవసేవలో ఉన్న 60 మంది గురువులు, 200 మంది మఠకన్యలు ఒకే చోటకు చేరి సందడి చేశారు. వేడుకులు విజయవంతం చేసేందుకు ఆర్థిక, సామాజిక సహాయం అందించిన వారికి స్థానిక విచారణ గురువులు చిన్నాబత్తిన హృదయ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. శత వార్షికోత్సవం సందర్భంగా గత మూడు రోజులు నిత్యం 25 వేల మందికి అన్నదానం నిర్వహించారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా అన్నపానీయాలు అందుబాటులో ఉంచారు.
పాటిబండ్లలో ఆధ్యాత్మిక సందడి
వైభవంగా ముగ్గురు రాజులుశత వార్షికోత్సవాలు వందలాది మంది మత గురువులతో ప్రత్యేక దివ్యపూజ బలి వేలాదిగా తరలివస్తున్న కతోలిక్‌లు నిత్యం 20 వేల మందికి అన్నదానం తరలిరానున్న తెలుగు రాష్ట్రాల పీఠాధిపతులు
Comments
Please login to add a commentAdd a comment