వైఎస్సార్ సీపీ అభిమాని ఆత్మహత్యాయత్నం
● టీడీపీ నాయకుల వేధింపులే కారణం ● రేపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలింపు
భట్టిప్రోలు: తెలుగుదేశం పార్టీ నాయకుల వేధింపులు తాళలేక వైఎస్సార్ సీపీ అభిమాని పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన ఇది. భట్టిప్రోలు మండలం సూరేపల్లి పంచాయతీ పరిధిలోని తాతావారిపాలెం గ్రామానికి చెందిన పడమటి శేషగిరిరావు శనివారం భట్టిప్రోలు పరిధిలోని పంట పొలాల్లో పురుగుమందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నాడు. పంట పొల్లాలో పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలు గుర్తించి అధికారులకు సమాచారం తెలియజేశారు. సమాచారం మేరకు కుటుంబ సభ్యులు, బంధువులు 108 వాహనంలో రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు రేపల్లె ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బాధితుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ నాయకులు పడమటి శ్రీనివాసరావు, జంగం వాసు, బొల్లెద్దు ప్రతాప్, వాకా అంకబాబు, మోర్ల సత్యనారాయణ, పీజీ అరుణ్‌శాస్త్రి, పడమటి సాయి, రావు చంద్రశేఖరరావు, యన్నం సురేష్ ఉన్నారు.
సాగునీటి సమాచారం
తాడేపల్లిరూరల్ (దుగ్గిరాల) : కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు సీతానగరం వద్ద శనివారం 1516 క్యూసెక్కులు విడుదల చేశారు. బ్యాంక్ కెనాల్‌కు 74, తూర్పు కెనాల్‌కు 204, పశ్చిమ కెనాల్‌కు 100, నిజాంపట్నం కాలువకు 53, కొమ్మమూరు కాలువకు 1005 క్యూసెక్కులు విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment