(హనుమకొండ – వరంగల్)
గురువారం శ్రీ 27 శ్రీ జూలై శ్రీ 2023
కాకాజీకాలనీలో రోడ్డుపై ప్రవహిస్తున్న వరద
7
ఇళ్లకు తాళం వేసి పునరావాస కేంద్రానికి వెళ్లడంతో నిర్మానుష్యంగా ఉన్న సాకరాశికుంట కాలనీ
వరంగల్ అర్బన్/హన్మకొండ/హసన్‌పర్తి/కాజీపేట/మడికొండ/
ఖిలావరంగల్/ కాశిబుగ్గ/కరీమాబాద్ : వరంగల్ మహా నగరాన్ని వర్షం వెంటాడుతోంది. బుధవారం కొద్ది సేపు విరామమిచ్చినా.. భారీ వర్షాలతో నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు తేరుకోవడం లేదు. రోడ్లు, డ్రెయినేజీలు చెరువులయ్యాయి. కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకుపోయాయి. చెరువుల మత్తళ్లతో పోటెత్తిన వరద, భారీ వర్షం.. వెరసి నగర జీవికి తీరని వేదన మిగిల్చింది. లోతట్టు ప్రాంతాల వారు చుట్టూ నీరు ఉన్నా తాగేందుకు గుక్కెడు మంచినీరు లేక అల్లాడిపోతున్నారు. ఇళ్లల్లో పేరుకుపోయిన బురద తొలగించేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరంగల్ అండర్ బ్రిడ్జి, చిన్న బ్రిడ్జి, ములుగు రోడ్డు, వేణురావు కాలనీ, బట్టల బజారు వేంకటేశ్వర స్వామి దేవాలయం తదితర ప్రాంతాల్లో నడుములోతు వరద రావడంతో రాకపోకలు స్తంభించాయి. మరో రెండు, మూడ్రోజులపాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో బల్దియా, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.
న్యూస్‌రీల్
వరదలోనే నగరంలోని లోతట్టు ప్రాంతాలు రోజంతా కురిసిన వర్షం
చెరువులను తలపిస్తున్న రోడ్లు, డ్రెయినేజీలు, కాలనీలు
పునరావాస కేంద్రాల్లో పలు ముంపు కాలనీలవాసులు
మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని
వాతావరణ శాఖ హెచ్చరిక
పరిస్థితిపై మేయర్, కమిషనర్, అధికారుల సమీక్షలు, సందర్శన
ఇంజనీర్ల ముందు చూపులేక ‘హంటర్’కు ముంపు సమస్య
Comments
Please login to add a commentAdd a comment