వరంగల్ ఐటీ.. గ్లోబల్ కేపబిలిటీ
జీసీసీ ప్లేబుక్‌లో రాష్ట్రంలో నగరానికి రెండో స్థానం
● హైదరాబాద్ తర్వాత ఐటీ అభివృద్ధికి అనుకూలతలు
● నాస్కామ్, అన్ ఎర్త్ ఇన్‌సైట్ అధ్యయనంలో వెల్లడి
● ఎయిర్‌పోర్ట్, మెట్రో నియో సేవలు వస్తే ఇంకా విస్తృతి
● మిలియన్ చదరపు అడుగులతో సరికొత్తగా క్లస్టర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రముఖ యూనివర్సిటీలు, 50కిపైగా కాలేజీల ద్వారా 20 వేల వరకు గ్రాడ్యుయేట్లు ఏటా
బయటకు వస్తున్నారు.
దీనివల్ల మానవ
వనరులకు
కొదువ లేదు.
లేదు.
సాక్షి, వరంగల్ :
రాష్ట్రంలో ‘ఎగ్జిస్టింగ్ అండ్ అప్ కమింగ్ టెక్నాలజీ హబ్స్’లో హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం నిలిచింది. నాస్కామ్, రీసెర్చ్ పార్టనర్ అన్ ఎర్త్ ఇన్ సైట్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ (జీసీసీ)ప్లేబుక్‌లో నాలుగు నగరాలకు చోటు దక్కితే.. అందులో రెండో స్థానంలో వరంగల్ ఉంది. మూడు, నాలుగు స్థానాల్లో కరీంనగర్, నిజామాబాద్ చోటు దక్కించుకున్నాయి. హైదరాబాద్ తర్వాత ఇక్కడే ఐటీ కంపెనీల నిర్వహణకు అనుకూల వాతావరణం ఉండడంతో ఇప్పటికే ఎల్‌టీఐ మైండ్ ట్రీ, జెన్‌ప్యాక్, సైయంట్ వంటి ముఖ్య కంపెనీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయని పేర్కొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా మంచి పేరున్న ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)’ ఉండడం కూడా ఐటీ అభివృద్ధికి కలిసొచ్చే అంశంగా పేర్కొంది. ఇప్పటికే ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారులు, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు మామునూరు ఎయిర్ పోర్ట్, ప్రతిపాదిత మెట్రో నియో సేవలు కూడా కార్యరూపం దాలిస్తే ఐటీ కంపెనీల బూమ్ ఇంకా విస్తృతమయ్యే అవకాశముందని చెప్పుకొచ్చింది.
జీసీసీ ఏర్పాటులో స్పెషల్ ఎకనామిక్ జోన్ (సెజ్), వరంగల్ ఐటీ పార్కు కీలకం. అదే సమయంలో కాజీపేట, హనుమకొండ ప్రాంతాలు కూడా ఐటీ కార్యాలయాలకు ఆలవాలంగా మారనుంది.
● ఇప్పటికే పలు టెక్ సర్వీసెస్ కంపెనీలుండగా, స్టార్టప్ టెక్‌లు కొన్ని ప్రారంభమయ్యాయి. టెక్‌లు, ఆర్‌అండ్‌డీ, బీపీఎం ప్రొఫెషనల్స్ వంటి వారితో టాలెంట్ ఫుల్‌గా ఉంది.
● 10 నుంచి 20 మిలియన్ చదరపు అడుగులు, 5 నుంచి 10 మిలియన్ చదరపు అడుగులతో సౌకర్యవంతమైన హౌసింగ్ అండ్ రెసిడెన్షియల్ అందుబాటులోకి రా నుంది.1,000 చదరపు అడుగులకు రూ. 10 నుంచి రూ.20 వేల అద్దె ఉండనుంది.
● రియల్ ఎస్టేట్ డెవలపర్స్, సెజ్ ప్రొవైడర్ పార్టనర్, ఆఫీస్ స్పేసెస్ ఇన్ ఐటీ పార్కు, సెజ్‌లతో ఐటీ కంపెనీల విస్తృతి పెరిగే అవకాశముంది. రి క్రూట్‌మెంట్ ఏజెన్సీస్, ఆర్‌పీఓ, స్టాఫింగ్ మ్యాన్ పవ ర్ సొల్యూషన్స్,హెచ్‌ఆర్ అండ్ పేరోల్ కంపెనీ లు, యూనివర్సిటీ, విద్యాసంస్థలతో కలిసి పని చేయడం, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లతో టా లెంట్‌పార్టనర్స్ అందుబాటులో ఉండడం కూడా కలిసొచ్చే అవకాశంగా ఉందని పేర్కొంది.
● స్టార్టప్ పార్టనర్స్‌గా ఇన్నోవేషన్ హబ్స్, ఇంక్యుబేషన్, అక్లిరేటర్ ప్రోగ్రాంలు ఉన్నాయి.
● వచ్చే ఐటీ పార్కులు, ఆఫీస్ స్పేస్‌లతో టైర్ 2 సిటీలను రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి మొదటి దశలో ఉంది.
● ఎస్‌టీపీఐ, వరంగల్ ఐటీ పార్కు, కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ (కిట్స్), కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, హనుమకొండ ఐటీ పార్కు ఇప్పటికే అందుబాటులోకి వచ్చి వేలాది మందికి ఉపాధి అవకాశాలిస్తున్నాయి.
● ఒక మిలియన్ చదరపు అడుగులతో సరికొత్తగా క్లస్టర్ అందుబాటులోకి రానుందని జీసీసీ బుక్ వెల్లడించింది.
అవకాశాలు
ఎందుకున్నాయంటే..
Comments
Please login to add a commentAdd a comment