విలువలకు నిలువెత్తు రూపం వాజ్‌పేయి
గీసుకొండ: భారత ప్రజాస్వామ్య విలువలకు నిలువెత్తు రూపం మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 16వ డివిజ న్‌లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో బుధవారం వాజ్‌పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్ ఎంజీఎంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. వాజ్‌పేయి సుపరిపాలన అందించారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు బన్న ప్రభాకర్, కుసుమ సతీశ్, రత్నం, సతీశ్‌షా, వెంకట రమణ, ఎడ్ల అశోక్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, గోదాసి అశ్వి న్, రతన్, రాంబాబు, రాజేశ్వర్‌రావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment