మానవాళి రక్షణకు క్రీస్తు జననం
కాజీపేట రూరల్: క్రీస్తు పుట్టుక పరమార్థాన్ని తెలుసుకుంటేనే నిజమైన క్రిస్మస్ అని, పాపాల నుంచి రక్షించేందుకు క్రీస్తు మానవుడిగా జన్మించాడని ఫాతిమా కేథడ్రల్ చర్చ్ విచారణ గురువు ఫాదర్ కాసు మర్రెడ్డి అన్నారు. కాజీపేట ఫాతిమా కేథడ్రల్ చర్చిలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాదర్ కాసుమర్రెడ్డి క్రిస్మస్ దివ్య బలిపూజ సమర్పించి బాలయేసుకు దూపం వేసి ప్రత్యేక ప్రార్థనలు చేసి క్రిస్మస్ సందేశం అందించారు. అనంతరం కేక్ చేశారు. కార్యక్రమంలో కేథడ్రల్ చర్చి ప్రెసిడెంట్ బి.దయాసాగర్, వైస్ ప్రెసిడెంట్ కె.కిరణ్, సెక్రటరీ ప్రకాశ్‌రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
వడ్డేపల్లి చర్చిలో..
వడ్డేపల్లిలోని సేయింట్ పీటర్స్ కేథలిక్ చర్చిలో బుధవారం చర్చి విచారణ గురువు పాధర్ గంగారపు నవీన్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో ఫాదర్ సింగారెడ్డి ఇన్నారెడ్డి, చర్చి సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
కేథడ్రల్ చర్చి విచారణ
గురువు ఫాదర్ కాసుమర్రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment