కార్తీకం.. లక్ష దీపోత్సవం
– వివరాలు10లో
మరిన్ని ఫొటోలు 11లోu
నగరంలోని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల ఆలయంలో శుక్రవారం కార్తీకపౌర్ణమిని పురస్కరించుకుని లక్షదీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం రుద్రేశ్వరుడికి అఘోర పాశుపత ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. రాత్రి ఏర్పాటుచేసిన లక్షదీపోత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో రంగవల్లులు వేసి అరటి డొప్పల్లో కార్తీక దీపాలు వెలిగించారు. ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైన సామూహిక రుద్రాభిషేకాలు రాత్రి 10గంటల వరకు జరిగాయి. కూచిపూడి నృత్య ప్రదర్శనలు, అన్నమయ్య కీర్తనల ఆలాపన తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
– హన్మకొండ కల్చరల్
Comments
Please login to add a commentAdd a comment