సిబ్బందికి అదనపు భారం
శనివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2024
వరంగల్ అర్బన్: బల్దియా కాశిబుగ్గ సర్కిల్ పరిధి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు అదనపు పని భారంతో సతమతమవుతున్నారు. అధికారులు ఆదేశిస్తుండడంతో కాదనలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజు ఒక్కో బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ 20 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు సంబంధించి స్థలాలు, డాక్యుమెంట్లు పరిశీలించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఇటీవలి సమీక్షలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులను హెచ్చరించారు. నిర్ణీత గడువులోగా బిల్డింగ్ పర్మిషన్ల దరఖాస్తుల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలతోనే వారు ఆగమాగమవుతున్నారు. ఇవి చాలవన్నట్లు ప్రభుత్వం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో కాశిబుగ్గ సర్కిల్ పరిధి ఐదుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లను సూపర్‌వైజర్లుగా నియమించారు. సూపర్‌వైజర్ రోజూ 10 నుంచి 12 మంది ఎన్యుమరేటర్లను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ, ఎదురవుతున్న సందేహాల్ని నివృత్తి చేయాలి. అటు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు, అదనంగా సూపర్‌వైజర్ డ్యూటీలతో అదనపు భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట సర్కిల్ పరిధిలో పని చేస్తున్న ఆరుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు ఇంటింటా కుటుంబ సర్వే సూపర్‌వైజర్ బాధ్యతలు అప్పగించలేదు. కాశిబుగ్గ పరిధిలో మాత్రమే అప్పగించడంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లకు ఉన్నతాధికారులు టీపీఎస్, ఏసీపీలకు మాత్రం రోజువారీ విధులు మాత్రమే చక్కబెడుతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు కావడంతో అదనపు పనిభారంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
న్యూస్‌రీల్
Comments
Please login to add a commentAdd a comment