డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

Published Sat, Nov 16 2024 7:47 AM | Last Updated on Sat, Nov 16 2024 7:47 AM

డీఎల్

డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

వరంగల్‌ లీగల్‌: వరంగల్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి జస్టిస్‌ యం.సాయి కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ. నిర్మలా గీతాంబ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. స్టెనోగ్రాఫర్‌ (1), టైపిస్ట్‌ (1), రికార్డ్‌ అసిస్టెంట్‌ (2) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల్ని ఈనెల 23వ తేదీ సాయంత్రం 5గంటల్లోగా రిజిస్టర్‌ పోస్ట్‌ ద్వారా డిస్టిక్ర్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ–వరంగల్‌, డిస్ట్రిక్ట్‌ కోర్టు కాంప్లెక్స్‌కు పంపించాలని తెలిపారు. పూర్తి వివరాలకు వరంగల్‌ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. నియామక ప్రక్రియకు సంబంధించి అన్ని అంశాలను వరంగల్‌ జిల్లా కోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు.

రేపు ఉమ్మడి జిల్లా స్థాయి

చెస్‌ పోటీలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: కమల్‌కింగ్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈనెల 17న ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి చదరంగ పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్‌ నిర్వహణ కార్యదర్శి జి.రాంప్రసాద్‌ తెలిపారు. అండర్‌–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగంలో నిర్వహించే పోటీల వాల్‌పోస్టర్లను శుక్రవారం ప్రభుత్వ న్యాయవాది కె.నర్సింహారావు ఆవిష్కరించారు. హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించే ఈపోటీల్లో పాల్గొనే క్రీడాకారులు 16వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని రాంప్రసాద్‌ తెలిపారు. పేర్ల నమోదు, వివరాల కోసం 96760 56744 నంబర్‌లో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో షేక్‌సలీమ్‌, మార్టిన్‌ పాల్గొన్నారు.

అభివృద్ధి బాటలో

రైల్వే ఈసీసీఎస్‌

కాజీపేట రూరల్‌: రైల్వే ఎంప్లాయీస్‌ కో–ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ (ఈసీసీఎస్‌)ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు ఈసీసీఎస్‌ ఎం.డి, మజ్దూర్‌ యూనియన్‌ ఏడీఎస్‌ చిలుకుస్వామి అన్నారు. కాజీపేట రైల్వే డీజిల్‌ లోకో షెడ్‌ ఎదుట శుక్రవారం రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ డీజిల్‌ బ్రాంచ్‌ చైర్మన్‌ ఎస్‌.కె.జానీ ఆధ్వర్యంలో గేట్‌ మీటింగ్‌ జరిగింది. ఈమీటింగ్‌లో చిలుకుస్వామి మాట్లాడుతూ.. డిసెంబర్‌ 4, 5 తేదీల్లో జరిగే ఎన్నికల్లో జెండా గుర్తుకు ఓటు వేయాలన్నారు. సీసీఎస్‌ సొసైటీలో మజ్దూర్‌ యూనియన్‌ పాలక మండలి ఎనిమిది నెలల్లో రెండు సార్లు డివిడెంట్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రైల్వే కార్మికుల సమస్యల పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం మజ్దూర్‌ యూ నియన్‌ నిరంతరం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో మజ్దూర్‌ యూనియన్‌ డీజిల్‌ బ్రాంచ్‌ సెక్రటరీ పి.వేదప్రకాశ్‌, ట్రెజరర్‌ జి.రాజేశ్వర్‌రావు, అసిస్టెంట్‌ సెక్రటరీ యాదగిరి, నరేశ్‌యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ తిరుపతి, భా స్కర్‌రెడ్డి, వి.యాదగిరి, నాగరాజు, వెంకట్‌, అశోక్‌, సంఘీ శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, చేరాలు, శ్రీధర్‌, రవీందర్‌, శంకర్‌, చంద్రమౌళి, నళినికాంత్‌, జానీ, సుబానీ, అజీముద్దీన్‌, అంతయ్య పాల్గొన్నారు.

ఇండోర్‌ స్టేడియం

అభివృద్ధికి కృషి: నాయిని

వరంగల్‌ స్పోర్ట్స్‌: హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం ఎదురుగా ఉన్న డీఎస్‌ఏ ఇండోర్‌ స్టేడియాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఇండోర్‌ స్టేడియాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. స్టేడియంలోని సమస్యలను బ్యాడ్మింటన్‌ సంఘం బాధ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే మరమ్మతులకు రూ.20 లక్షల నిధులను డిసెంబర్‌లో మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, డీఎస్‌ఏ బ్యా డ్మింటన్‌ కోచ్‌ కూరపాటి రమేశ్‌, బ్యాడ్మింటన్‌ సంఘం బాధ్యులు పవన్‌, విజయ్‌కుమార్‌, శ్రీ నివాస్‌, బాలకృష్ణ, రాజిరెడ్డి, మహేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, సంపత్‌రావు, కిరణ్‌రాజు, నా యకులు నాయిని లక్ష్మారెడ్డి తదితరులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు1
1/2

డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు2
2/2

డీఎల్‌ఎస్‌ఏలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement