బిల్లులిస్తాం.. పనులు పూర్తి కావాలి
వరంగల్ అర్బన్ : పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు వెంటనే చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని, పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో ఇంజనీరింగ్, అకౌంట్స్ విభాగాల అధికారులు, సిబ్బందితో ఆమె సమీక్షించారు. విభాగాల వారీగా వివరా లు తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణానికి రూ.4,170 కోట్లు, అభివృద్ధి పనులకు రూ.187 కోట్లు, అడ్మినిస్ట్రేటివ్ భవనానికి రూ.32.50కోట్లు, ఐదు రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూ.49.50కోట్ల నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులకు మేయర్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ జనరల్ ఫండ్, సీఎంఏ, పట్టణ ప్రగతి నిధులతో పూర్తయిన, అసంపూర్తిగా ఉన్న, అసలు మొదలు కాని పనుల వివరాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. గతంలో నిధుల్లేక నిలిచిపోయిన వాటిని వేగంగా పూర్తి చేయాలని, పనులు ప్రారంభకం కాకపోతే రద్దు చేసి, రీకాల్ చేయాలని సూచించారు. నిబంధనల మేరకు బిల్లుల చెల్లింపులు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు మహేందర్, శ్రీనివాస్, సంతోష్ బాబు, డీఈలు సారంగం, కార్తీక్ రెడ్డి, రవి కిరణ్, రాజ్ కుమార్, అకౌంట్స్ ఆఫీసర్ సరిత, ఏఈలు, డీబీ సిబ్బంది పాల్గొన్నారు.
నగర మేయర్ గుండు సుధారాణి
అభివృద్ధి పనులపై సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment