పోలీసుల అదుపులో
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో 19 కిలోల బంగారం చోరీ కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు రెండు వారాలయ్యాక కాస్త పురోగతి సాధించారు. ఈ నేరానికి ఉపయోగించిన వాహన యజమానితోపాటు మరొకరిని మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సరిహద్దులో ప్రత్యేక బృందాలు అదుపులోకి తీసుకొని మంగళవారం వరంగల్‌కు తీసుకొచ్చినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గత నెల 18న అర్ధరాత్రి దాటాక రాయపర్తి ఎస్ బీఐలో 19 కిలోల బంగారం ఎత్తుకెళ్లినట్టుగా భావి స్తున్న మరో నలుగురు నిందితుల ఆచూకీని కనుగొన్న ప్రత్యేక బృందాలు వారు చోరీ చేసిన బంగారాన్ని రికవరీ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తె లిసింది. ఘటనా స్థలి వద్ద లభించిన ఆక్సిజన్ సిలిండర్‌తోపాటు చోరీ సొత్తుతో రాయపర్తి నుంచి ఖమ్మం హైవే మీదుగా వెళ్లే సమయంలో సీసీ టీవీ కెమెరాలకు చిక్కిన వాహన నంబర్, ఘటనాస్థలిలో లభించిన మరిన్ని శాసీ్త్రయ ఆధారాలతో పాత నేరస్తుల పనే అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. క ర్ణాటక, తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్ పోలీసులతో సంప్రదింపులు జరిపారు. ఇక్కడ చోరీ జరిగి న విధానాన్ని బట్టి అక్కడ జరిగిన చోరీల విధానం తెలుసుకోవడంతో ఈ కేసుపై క్లారిటీ వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన 19 ప్రత్యేక బృందాలు ఆ యా రాష్ట్రాల్లో తిరిగి ఆ ముఠా కదలికలపై ఆరా తీ సినట్టు తెలిసింది. టెక్నికల్ బృందం ఇచ్చిన ప్రత్యేక సహకారంతోనే ఈ కేసులో కీలకంగా ఉన్న వాహన ఆచూకీని ఉత్తరప్రదేశ్ సరిహద్దులో కనుగొని ఆ వాహన యజమానితోపాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారం ఆధారంగానే ఈ కేసు కొలిక్కి వచ్చినట్టుగా తెలిసింది. ఇటీవల రాచకొండ పోలీసులు, కర్ణాటక పోలీసులు రాయపర్తిలోని చోరీ జరిగిన బ్యాంక్‌ను పరిశీలించి వెళ్లాక కేసు దర్యాప్తులో వేగిరం పెరిగింది. ఆ ఇద్దరు నిందితులను పట్టుకోవడంతో వరంగల్ పోలీసులు కాస్త ఉపశమనం పొందినట్టుగా కనిపిస్తోంది. బంగారం రికవరీ అయ్యాకనే నిందితులను మీడియా ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
వాహన యజమానితోపాటు
మరొకరికి సంకెళ్లు
వీరిచ్చిన సమాచారంతోనే కొలిక్కి వస్తున్న కేసు
త్వరలోనే మిగిలిన నిందితులతో అరెస్టు ప్రకటించే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment