ఇంటర్‌వర్సిటీ చెస్ పోటీలకు కేయూ మహిళా జట్టు
కేయూ క్యాంపస్: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో ఈ నెల 7వ తేదీవరకు జరగనున్న సౌత్‌వెస్ట్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ చెస్ మహిళా పోటీలకు కాకతీయ యూనివర్సిటీ జట్టును ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే వారిలో బి. నవ్య, ఎస్. స్నేహిత (హనుమకొండ కిట్స్‌కాలేజీ), బి. దేవిక (వరంగల్ ఎల్‌బీ కాలేజీ), టి. మాధుర్య (కేయూ ఇంజనీరింగ్ కాలేజీ కో–ఎడ్యుకేషన్), కె. శ్రావిక (టీఎస్‌డబ్ల్యూఆర్‌డీసీ ఖమ్మం), కె. భార్గవి (టీఎస్‌డబ్ల్యూ ఆర్‌డీసీ ఖమ్మం ) ఉన్నారు. వీరికి కొత్తగూడెం టీఎస్‌డబ్ల్యూ ఆర్‌డీసీ గర్ల్స్ వ్యాయామ అధ్యాపకురాలు డి. శ్వేత మేనేజర్‌గా వ్యవహరిస్తారని వెంకయ్య తెలిపారు. కాగా, ఈ పోటీలు ఈనెల 4న ప్రారంభమయ్యాయి.
కిషోర్ మృతదేహం అప్పగింత
ఏటూరునాగారం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా గంగులూరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాంపేడ్ గ్రామానికి చెందిన మావోయిస్టు కిషోర్ ఇటీవల జరిగిన చెల్పాక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం కన్నాయిగూడెం తహసీల్దార్ వేణుగోపాల్ సమక్షంలో కిషోర్ మృతదేహాన్ని అతని సోదరుడు పూనేష్‌కుమార్‌కు సీఐ శ్రీనివాస్, ఎస్సై తాజొద్దీన్‌లు అప్పగించారు. ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మృతి చెందగా అందులో ఏగోలపు మల్లయ్య అలియాస్ మధు కేసు హైకోర్టులో ఉండగా దానిని పోస్టుమార్టం గదిలోనే భద్రపర్చారు. మిగతా నలుగురు మావోయిస్టులు భద్రు, జమున, కామేశ్, కరుణాకర్‌ల మృతదేహాలను మంగళవారం వారి కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. ఇక మల్లయ్య కేసు నేడు విచారణ కొనసాగనుంది. జైసింగ్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినప్పటికీ ఎవరూ రాలేదని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment