సీఎం కప్ పోటీలను విజయవంతం చేయాలి
వరంగల్ స్పోర్ట్స్: సీఎం కప్ క్రీడా పోటీల విజయవంతానికి క్రీడా సంఘాల బాధ్యులు, సీనియర్ క్రీడాకారులు కృషి చేయాలని వరంగల్ ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్ అన్నారు. సీఎం కప్ సన్నాహక సమావేశాన్ని బుధవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నూతన రెజ్లింగ్ హాల్ నిర్మాణ ఆవరణలో నిర్వహించారు. హనుమకొండ జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి గుగులోతు అశోక్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి అజీజ్‌ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం కప్ పోటీల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర స్థాయిలో పాల్గొనే క్రీడా జట్లకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డీవైఎస్‌ఓ అశోక్‌కుమార్ మాట్లాడుతూ సీఎం కప్ పోటీలు మూడు దశలుగా ఉంటుందని, పేర్లు వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇటీవల గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా భాద్యతలు స్వీకరించిన సందర్భంగా అజీజ్‌ఖాన్‌ను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి దస్రూనాయక్, పీఈటీలు, పీడీలు వివిధ క్రీడాసంఘాల బాధ్యులు పాల్గొన్నారు.
7 నుంచి సీఎం కప్ క్రీడలు
వరంగల్: వరంగల్ జిల్లాలో ఈనెల 7 నుంచి సీఎం కప్–2024 పోటీలు ప్రారంభం అవుతాయని జిల్లా యువజన క్రీడల అఽధికారి సత్యవాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు తమ పేర్లను cmcup2024.telangana. gov.inలో నమోదు చేసుకోవాలని కోరారు. మొబైల్ ఫోన్‌లో కూడా నమోదు చేసుకునే సౌకర్యం ఉందని, లింక్ ఈనెల 6వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని డీవైఎస్‌ఓ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment