కేంద్ర బృందం పర్యటనకు లైజన్ ఆఫీసర్లు
సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద
వరంగల్: విపత్తు అనంతరం అవసరాల అంచనా (పోస్ట్ డిజాస్టర్ నీడ్స్ అసెస్‌మెంట్స్) కోసం జిల్లా పర్యటనకు వచ్చిన 30 మంది అధికారుల బృందానికి లైజన్ ఆఫీసర్లను నియమించినట్లు కలెక్టర్ సత్య శారద తెలిపారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో బుధవారం నిర్వహించిన అధికారుల సమీక్షలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో గురువారం నుంచి కేంద్ర బృందం పర్యటిస్తుందని తెలిపారు. ఆరు బృందాలుగా విభజించి ఒక్కో బృందానికి ఒక తహసీల్దార్, ఎంపీడీఓను లైజన్ ఆఫీసర్లుగా నియమించినట్లు పేర్కొన్నారు. పరిశీలనకు వస్తున్న కేంద్ర బృందానికి సంబంధిత జిల్లా అధికారులు, తహసీల్దార్లు సహకరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, జిల్లాలోని తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
నేడు ఎంజీఎంలో క్యాంటీన్ ప్రారంభం
ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను గురువారం ప్రారంభిస్తారని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం అధికారులతో నిర్వహించిన విజయోత్సవాల సమీక్షలో ఆమె మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment