అభివృద్ధి పనుల్లో వేగం పెరగాలి
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు ఇంజనీర్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జనరల్ ఫండ్, పట్టణ ప్రగతి, సీఎంఏ, తదితర అభివృద్ధి పనులపై ఆమె సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా వ్యాప్తంగా వివిధ డివిజన్లలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని ఏఈల వారీగా అడిగి తెలుసుకున్నారు. ప్రారంభం కాని.. పెండింగ్ పనులపై క్షేత్రస్థాయిలో పర్యటించి వేగవంతం చేయాలన్నారు. పనుల నాణ్యతను పరీక్షించి ప్రమాణాలు పాటించేలా చూడాలని సూచించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈ ప్రవీణ్ చంద్ర, ఈఈలు శ్రీనివాస్, మహేందర్, సంతోశ్‌బాబు, డీఈలు కార్తీక్‌రెడ్డి, రవికిరణ్, కృష్ణమోహన్, శివా నంద్, ఏఈలు, డీబీ సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment